పూర్వజన్మలో తానొక మైనా పిట్టననుకొనే రాకుమారి వెయ్యి రూపాయల ధర పలికిన కొబ్బరికాయ మాటలతో మూటలు నింపిన గొర్రెల కాపరి... రాజులు,  పేదలు, దాతలు, లోభులు, విజ్ఞులు, మూర్ఖులు, వింత వ్యక్తులు, తమాషా మనుషులు - ఇలాంటి వారంతా ఈ కధల్లో మీకు తారసపడతారు. తాను జవాబు చెప్పలేని ప్రశ్న వేసేవాడినే పెళ్ళాడతానన్న గడసరి రాకుమారి ఆశబోతు బంధువులను బూడిదతో బురడీ కొట్టించిన అనాధబాలుడు కష్టాల్లో ఉన్న వృద్ధదంపతులకు   కాపాడిన మాయడోలు...సుధామూర్తికీ చిన్నపుడు ఆమె తాత, అవ్వ ఇలాంటి కధలు చాలా చెప్పారు. కొన్ని ఇతర దేశాల్లో స్నేహితులు చెప్పగావిన్నవి. ఎన్నటికి వన్నె తరగని ఆహ్లాదకరమైన ఈ జానపద కధలను పిల్లలకు ఆమె ఎన్ని మార్లు చెప్పారో లెక్కలేదు! చిన్నాపెద్దా అందరినీ అలరించే ఈ కధలను మరెందరో చదివి ఆనందిస్తారని కోరుకుంటున్నాము. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good