రహస్యంగా శవానికి ఆపరేషను చేసి, చెవిలోపలి భాగాలు ఎలా ఉంటాయో పరిశీలించి, చెవిటి-మూగ వారికి మాటలు నేర్పే యంత్రం తయారు చెయ్యాలని మొదలుపెట్టి, అయ్యవారిని చేయబోయి సోలచేసినట్లు -కాదు కాదు సోల చేయబోయి అయ్యవారిని చేసినట్లు - అలగ్జాండర్‌ గ్రాహంబెల్‌ టెలిఫోను తయారుచేసిన వైనాన్ని ఈ గ్రంథంలో పూసగుచ్చినట్లు వర్ణించారు.

1876లో పక్కగదిలో కూర్చున్న మెకానిక్కు వాట్సన్‌ చెవిలో అల్పాలంగా వినిపించిన గ్రాహంబెల్‌  గారి టెలిఫోన్‌ గుసగుసలు ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభోవీధిపై నంతై అన్నట్లు పెరిగి పెరిగి పదేళ్ళల్లో ప్రపంచపు ఈమూల నుంచి ఆ మూలకి సెకనులో 15వ వంతు వ్యవధిలో తీగల ద్వారా మనం మాట్లాడే మాటలు యథాతథంగా ప్రసారం చేయగల అద్భుత సాధనంగా పరిణతి చెందిన టెలిఫోను కథను వివరించారు రచయిత.

పేజీలు : 96

Write a review

Note: HTML is not translated!
Bad           Good