18వ శతాబ్దంలో కండబలాన్ని తోసిరాజని, ఆవిరిబలం మీద నడిచే యంత్రాన్ని నిర్మించి, ఊహకందని అపార శక్తి సంపదకు మానవుడు అధికారి కావడం ఎంతటి మహత్తరమైన విషయమో - వార్త మోసుకుపోవడానికి గుర్రాన్ని, పావురాన్ని మించిన వేగం ఎరుగని మానవుడు 19వ శతాబ్దంలో ఉన్నట్లుండి సెకనుకి 186,000 మైళ్ళ (3 లక్షల కిలోమీటర్ల) వేగంతో వార్తలు పంపగల ఎలక్ట్రిక్ టెలిగ్రాఫును కనిపెట్టడం నిజంగా అంతటి అద్భుత విషయం. ప్రపంచపు రూపురేఖలనే మార్చి వేసిన అసాధారణమైన ఆవిష్కరణలే ఈ రెండూనూ. కాని, ఇవి యూరపియనుల చేతికి చిక్కి, తక్కిన ప్రపంచాన్నంతా తమ గుప్పిట్లో ఉంచుకోవడంలో వారికి తోడ్పడ్డవి కావడం చరిత్రలో ఒక అపశ్రుతి.
ఆటవికుల డోళ్లవాయింపుతో అంచెలంచెలుగా వార్తా ప్రసారం చేయడంతో మొదలు పెట్టి, 'సెమఫోర్' అనబడే నడిమి రాయిమీద కాలు ఊనుకుని, అక్కడినుంచి ఒకే ఒక గంతులో కాంతివేగంతో వార్తలు పంపగల ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ కనిపెట్టడం వరకూ గల వివిధ ఘట్టాలను వివరించారు రచయిత.
పేజీలు : 143