తెలంగాణా సాయుధ పోరాటం ప్యూడల్‌ వ్యవస్థను బ్రద్దలు చేసింది. భూమి పంపకం ఆవశ్యకతను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించేటట్లు చేసింది. నిజాం సంస్థానం తెలంగాణా పోరాటంతో బీటలు వారి ముక్కోటి ఆంధ్రులు ఏకమై ఆంధ్రప్రదేశ్‌ను సాధించుకొని భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మార్గదర్శకత్వం వహించారు. కాని మనం దేనికైతే పోరాడి వేలమంది ప్రాణాలర్పించారో ఆ విశాలాంధ్రలో ప్రజారాజ్యం సాధించబడలేదు. ఇది మనం సాధించేదట్లు? కమ్యూనిస్టు ఉద్యమం ఐక్యం కాగలిగితే నేడున్న అనుకూల రాజకీయ వాతావరణంలో వామపక్ష ప్రజాతంత్ర, లౌకిక, శక్తులు పురోగమించగలవు. 25 ఏళ్ల నాడు కమ్యూనిస్టు పార్టీని చీల్చి చేసిందేమీలేదు. నేడు ఒక బూర్జువా పార్టీకి మరో బూర్జువా పార్టీ ప్రత్యామ్నాయం అని రొమ్ములువిరిచి ఘీంకారాలు పెట్టుచున్నాయి. ఇప్పటికైనా స్వల్ప విభేదాలు పక్కకుపెట్టి మార్క్సిస్టుపార్టీ కమ్యూనిస్టు పార్తీఓ చేతలు కలిపి బలమైన వామ పక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయానికి నడుం కట్టడమే పోరాటంలో మరణించిన 4000 మంది అమర వీరులకు సరైన నివాళులు అర్పించినవారవుతాం. అప్పుడే అమరవీరుల ఆశయాలకు న్యాయం చేకూర్చిన వారమవుతాం.

- నల్లా నరసింహులు

Pages : 213

Write a review

Note: HTML is not translated!
Bad           Good