'తెలంగాణ సాయుధ ప్రజా పోరాటం' పోరాటం మన దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహోన్నతమైన విప్లవ ప్రజా పోరాటం. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నిర్మూలన కోసం ప్రారంభమైన తెలంగాణా ప్రజాందోళన చివరికి సాయుధ పోరాట స్వరూపాన్ని తీసుకొని నైజాం ముష్కర మూకలనూ ఆ తరువాత నెహ్రూ సైన్యాలను ఎదిరించి ఐదేండ్లపాటు 1946 నుండి 1951 వరకూ సాగింది. గత రెండు వందల సంవత్సరాల చరిత్రలో తెలంగాణా ప్రజా పోరాటంతో పోల్చదగిన ఉద్యమం గాని, పోరాటంగాని మన దేశ చరిత్రలోనే లేదు.

    సుందరయ్యగారు రచించిన ఈ గ్రంథం అసలు తెలంగాణా పోరాటపు మొత్తం చరిత్ర. ఏ సామాజిక, రాజకీయ, భౌతిక పరిస్థితిల్లో ఆ పోరాటం పుట్టి పెరిగిందో వివరించి, మారిన పరిస్థితుల రీత్యా దాని ఉపసంహరణ ఎలా అవసరమైనదీ విశదీకరించి, అమూల్యమైన గుణపాఠాలు తీసిన గ్రంథం ఇది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good