ఇటువంటి అధ్యయనాలు విస్తృతంగా గతంలో జరిగాయి. ఇప్పుడుకూడా నిర్వహించబడుతున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిaలో ఉద్యమాలు నిర్మించే సంఘాలకు, కార్యకర్తలకు స్థూల అధ్యయనం ఎంత అవసరమో అంతకన్నా ఎక్కువ క్షేత్రస్థాయి అధ్యయనం అవసరం. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. సరళీకరణ విధానాలు వచ్చిన తర్వాత వ్యవసాయంలో, రైతాంగంలోని భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని, చీలికలను ఇంకా వేగిరపరిచింది. అందుకే అధ్యయనం అవసరం ఇంకా పెరిగింది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యమకారులకు, అలాగే గ్రామీణ జీవితాన్ని అర్థం చేసుకోవాలనే ఆసక్తి కలిగిన ఇతరులకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము.

- బి.వి.రాఘవులు

పేజీలు : 280

Write a review

Note: HTML is not translated!
Bad           Good