జ్యోతి వలబోజు పేరు భోజన ప్రియులందరికీ పరిచయమే. పత్రికల్లో ఆమె రకరకాల రుచికరమైన వంటకాలని పాఠకులకి అందిస్తున్నారు. ఓ రోజు మాటల్లో తెలంగాణా నించి వచ్చిన ఆమెని కేవలం తెలంగాణా వంటల పుస్తకాన్ని వెలువరిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని, అలాంటి పుస్తకం మార్కెట్లో లేదని సూచించాను. తనకీ అలాంటి ఉద్దేశం ఉందని చెప్పారు. ఇందుకోసం ఆమె వివిధ తెలంగాణా జిల్లాల వంటకాలని ఎంతో కృషి చేసి సేకరించారు. మీ చేతిలోని పుస్తకంలో వాటిని చూడవచ్చు.

బచ్చలికూర పచ్చడి, పాలకూర పచ్చడి, మునగాకు పచ్చడి, గంగవాయిలికూర పచ్చడి, వాక్కాయ ఆవకాయ మా కృష్ణా జిల్లాలో నేనెప్పుడు వినలేదు, తినలేదు. అలాగే పులిసింత పప్పు, కారంపప్పు, పుల్లపప్పు, చేమగడ్డ పప్పు, గంగవాయిలికూర పప్పు కూడా చాలామందికి కొత్త ఐటెమ్స్‌. తెలంగాణాకి వచ్చేదాకా నేను గంగవాయిలి కూర పేరే వినలేదు. కొబ్బరి, వంకాయ కలిపి పచ్చడి చేస్తారని తెలుసు. 'ఆ రెండు కలిపి కూర చేసినప్పుడు పచ్చడి ఎందుకు చేయకూడదు?' అనే ఆలోచన నాకు కలిగింది. ఇదే క్రియేటివిటీ అంటే. మనవాళ్ళు సాంప్రదాయ వంటలని తప్ప కొత్తవి కనిపెట్టరు. ఇదే విదేశాలలో అయితే నమ్మలేనంతగా కొత్త వంటకాలని కనిపెడుతూ ఉంటారు. గార్లిక్‌ ఇన్‌ ల్యాజ్డ్‌ ఆలివ్‌ సీసాని నేను కాలిఫోర్నియాలో కొన్నాను. గోంగూర పచ్చడిలో ఆ నూనె కలుపుకుంటే వెల్లుల్లి కూడా కలిపి గోంగూర పచ్చడి చేసారా అనిపించింది. జ్యోతిగారిలో ఇలాంటి ఇన్‌వెంటివ్‌ మైండ్‌ని మనం ఈ పుస్తకంలో గమనించవచ్చు.  ముఖ్యంగా తెలంగాణా వంటలు పరిచయం లేని ప్రాంతాల్లో వారికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగిస్తుంది.

- మల్లాది వెంకట కృష్ణమూర్తి

Pages : 288

Write a review

Note: HTML is not translated!
Bad           Good