అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మాంసాహార వినియోగం కూడా ఏ యేటికాయేడు పెరుగుతూనే వస్తోంది. చికెన్‌ మటన్‌ వేలాది టన్నుల వినియోగంలో ఉంది. కోస్టల్‌ ప్రాంతం తెలంగాణాకు ఏ మాత్రం అందుబాటులో లేకున్నప్పటికీ 2011లో లక్షన్నర టన్నుల చేపల, రొయ్యల ఉత్పత్తి, వినియోగం తెలంగాణా మొత్తం మీద జరిగింది. 2012లో అది రెండు లక్షల టన్నులకు పెరిగింది. గత సంవత్సరం అది మరింత పెరిగి రెండు లక్షల 19 వేల టన్నులకు చేరుకుంది. ఇక గుడ్ల ఉత్పత్తిలో నయితే తెలంగాణా దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఇవన్నీ మన ఆహారపు అలవాట్లలో మాంసాహార పాత్రని చెప్పకనే చెపుతున్నాయి. ఇకపోతే మతపరమైన అడ్డంకులు కూడా ఒక మేర పాక్షికమైనవే. పశ్చిమ బెంగాల్‌లో బ్రాహ్మనులు చేపలు తింటారట. వారు చేపలను 'జలపుష్పాలు'గా పరిగణిస్తారు. అంటే వారి దృష్టిలో చేపలంటే ఒక రకం సముద్రపు ఆకుకూరలాంటివన్నమాట! అయితే వాళ్లు కూడా ఇతర మాంసాహారం ముట్టుకోరు. అదేవిధంగా చాలాచోట్ల శాకాఖారులు కోడిగుడ్లను కూడా శాకాహారంగానే పరిగణిస్తారు. అయినా మాంసాహారానికి నిర్వచనం జీవం ఉందా లేదా అని కానీ, ప్రోటీన్‌ ఉందా లేదా అని కానీ, జంతు ఉత్పన్నమా లేక మొక్కలనుంచి ఉత్పన్నమా అనే వాటి ఆధారంగా చేసుకుని విడగొట్టలేము. అది కొంచెం క్లిష్టమైన పనే!

ఈ పుస్తకంలో జ్యోతి వలబోజుగారు మరీ లోతైన వివరణలో, శాస్త్రీయ పద్ధతులంటూ కృత్రిమమైన ప్రయోగాలే కాకుండా స్వయంగా తను చిన్నప్పటి నుంచి గమనించిన వంటకాలను, వారి ఇండ్లలో తయారుచేసుకునే వంటకాలనూ యథాతథంగా నేర్చుకున్న పద్ధతిలోనే రాశారు. 

- కట్టా శ్రీనివాస్‌

Pages : 240

Write a review

Note: HTML is not translated!
Bad           Good