చదవటానికి చరిత్ర తాలూకు వేలవేల పేజీలుంటే విశాలమైన దేశంలో ఎక్కడో ఓ మూలవున్న గ్రామం ఏంచెబుతుందని అనుకుంటే అది ప్రజలచరిత్రకు నష్టం చేసినట్టే. మన సంప్రదాయ చరిత్ర పాఠాల్ని పక్కకు నెట్టి పల్లెల, పల్లె ప్రజల లోతుల్లోకి తొంగిచూసినప్పుడు చరిత్ర పరిశోధన మామూలుగా ఉండదు. మహా అద్భుతంగా వుంటుంది. ఆ అద్భుతం ఈ చిన్న పుస్తకం ''తెగిపడ్డ ఆ చెయ్యి''. అసలైన ప్రజలచరిత్ర ఇది. - జి.కళ్యాణరావు
....కారుమంచి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను చాలా పరిశోధనాత్మకంగా వివరించారు రచయిత సాగర్. ఆ విషయాలలో చేసిన పరిశోధన చాలా ఉపయోగకరంగా వుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో ఇంత పరిశోధనాత్మక వివరాలతో కూడి పుస్తకం రావడం కూడా ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ...ఒక గ్రామ ప్రగతి వెనుక, అభివృద్ధి వెనుక ఉన్న పోరాటాలు, త్యాగాలను వెలికితీయాల్సిన యువతరం కర్తవ్యాన్ని ఈ పుస్తకం బోధిస్తుంది. - మల్లేపల్లి లక్ష్మయ్య
పేజీలు : 110