ఇక్కడ

    సాదత్‌ హసన్‌ మంటో శాశ్వతంగా నిద్రపోతున్నాడు

    అతనితో పాటు

    కథా రచనా రహస్యాలూ, మెలకువలూ సమాధియై ఉన్నాయి

    కథా రచనలో ఎవడు గొప్పవాడు

    తనా లేక భగవంతుడా

    ఎన్నో టన్నుల మట్టి కింద విశ్రమిస్తూ

    అతను ఆశ్చర్యపోతూ ఉంటాడు

    (చనిపోడానికి ఏడాది ముందు మంటో తన సమాధి మీద రాయమని చెప్పిన వాక్యాలు)

    

    విప్లవ రచయితల సంఘం సభ్యులు వెలువరిస్తున్న ఈ మంటో కథల సంకలనం అనేక రకాలుగా ప్రశంసార్ధమయినది. ఇందులోని కథలు ప్రధానంగా రాజకీయ కథలు. అంతే స్థాయిలో ఇవి చారిత్రక కథలు... సామాజిక కథలు... అయితే ఇవి నేరుగా ఉర్దూ భాషనుంచి తెలుగులోకి వచ్చిన కథలు కావు. ఆంగ్ల పాఠకులను, మరీ ముఖ్యంగా విదేశీ ఆంగ్ల పాఠకులను దృష్టిలో వుంచుకుని చేసిన ఇంగ్లీషు అనువాదాలకు తెలుగు అనువాదాలు. ఆ మేరకు ఇంగ్లీషు అనువాదకుల పరిమితులన్నీ ఈ అనువాదాలకు అనివార్యంగా సంక్రమించాయి. ఈ అనువాదాలన్నీ ఒక్కరు చేసినవి కూడా కావు. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు చెందిన విరసం రచయితలు ఒక నిబద్ధతతో చేసిన ప్రయోగం. - ఖాదర్‌ మొహియుద్దీన్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good