సమ్మర్‌హిల్‌ స్కూల్‌ సంస్ధాపకుడు ఎ.ఎస్‌.నీల్‌ తన రచనల ద్వారా అనుభవం ద్వారా పిల్లల పెంపకంలో సంచలనం రేకెత్తించారు. పిల్లల పెంపకం, విద్యపై ఆయన పలు పుస్తకాలు రాశారు. వాటిలో 'ది ప్రాబ్లబ్‌ టీచర్‌' ఒకటి. 'టీచర్లకు మానసిక రుగ్మతలుంటే...' అనే పేరుతో తెలుగులో ఈ పుస్తకాన్ని మీ ముందుంచుతున్నాం.
టీచర్‌ మానసిక రుగ్మతకు లోనైనందువల్ల పిల్లలపై ఎటువంటి ప్రభావం ఉంటుంది? టీచర్‌ చుట్టూ ఉన్న పరిస్ధితులు అతనిపై ఎటువంటి ప్రభావం చూపుతున్నాయి? విద్యావ్యవస్ధపై మొత్తంగా ఎటువంటి రుగ్మతలో చిక్కుకుంది? తదితర అంశాలను నీల్‌ ఈ పుస్తకంలో వివరించారు. పిల్లలు మనసులో భయం ప్రవేశపెట్టి తద్వారా విద్యాబోధన సాగించాలన్న అభిప్రాయాన్ని నీల్‌ పూర్తిగా వ్యతిరేకించారు. స్వేచ్ఛ కలిగిన పిల్లలకు నేర్చుకునే శక్తి ఎలా ఉంటుందో ఆయన అనుభవ పూర్వకంగా చూపించారు - డాక్టర్‌ సుంకర రామచంద్రరావు 

Write a review

Note: HTML is not translated!
Bad           Good