ఇది, క్రీస్తు పూర్తం నించీ ఈనాటి వరకూ వున్న తత్వాలను పరిచయం చేసే చిన్న ప్రయత్నం మాత్రమే, అంతే.

ఈ పుస్తకం చదవవలసిన పాఠకులు శ్రామిక వర్గ స్త్రీ పురుషులూ, విద్యార్థులూ. ఈ పాఠకుల్నే నేను దృష్టిలో పెట్టుకున్నాను. ఈ పాఠకుల కోసం పుస్తకాలు చాలా తేలికైన పద్ధతిలో ఉండలి. లేకపోతే, రాసి ప్రయోజనం ఉండదు.
ఈ పుస్తకంలో వున్న చాప్టర్లలో, అక్కడక్కడ నేను చూపించిన కొటేషన్ల గురించి ముఖ్యంగా చెప్పాలి. కొటేషన్లలో కొన్నిటిని యధాతధంగా ఉంచాను. కొన్నిటిని, వాటిలో మాటల్ని కొంచెం తేలిక చేసే పద్ధతిలో ఇచ్చాను. వాటిలో, అవసరమైన చోట్ల దీర్ఘాలూ, విభక్తులూ, కామాలూ, వంటివి కూడ చేర్చాను. ఆ మార్పులు లేకపోతే, అవి సరిగా అర్ధం అయ్యే ప్రశ్నే లేదు.

ఈ పుస్తకం రాయడం కోసం నేను చదివిన పుస్తకాల లిస్టు అంతా, ఈ పుస్తకానికి చివర్లో ఉంది. వాటిల్లో చాలా పుస్తకాలు షాపుల్లోనో, లైబ్రరీల్లోనో, దొరికేవే. కొన్ని పుస్తకాలైనా తప్పకుండా చదవాలి.
'తత్వ శాస్త్రం' అంటే ఏమిటో, దాని చరిత్ర ఏమిటో, బొత్తిగా తెలీకుండా ఉండడం ఎందుకు? ఎంతో కొంత తెలుసుకోవడం మంచిది కదా? తత్వ శాస్త్రంతో కొంచెం పరిచయం తప్పకుండా అవసరం. అది సమాజానికి ఎంత అవసరమో తెలుస్తుంది.
- రంగనాయకమ్మ

Write a review

Note: HTML is not translated!
Bad           Good