8 సెంటిమెంటుతో 08-08-08 నాటికి క్రయిమ్‌ సినిమా స్క్రిప్టు రెడీ కావాలని పట్టుబట్టిన హాలీవుడ్‌ చైనీస్‌ నిర్మాతల కోసం నిలబడ్డాడు సినీ వ్యాపారి హిగ్గిన్స్‌...
ఇండో-అమెరికన్‌ సినిమాకై హిగ్గిన్స్‌తో టై-అప్‌ పెట్టుకుని, అన్న టైముకి యిచ్చి తీరతానని శపథం చేసి తన రచయిత అమర్‌నాథ్‌ను ఎవరికీ తెలియని చోటకు పంపి తగిన ఏర్పాట్లు చేశాడు స్టూడియో ఓనర్‌ బలరామయ్య...
ఆ టైముకి స్క్రిప్టు పూర్తి కాకుండా చూడాలన్న పంతంతో కిరాయి మనుష్యుల కోసం వెతికాడు బలరామయ్య పోటీ నిర్మాత నాగభూషణం...
ఒకప్పుడు బ్రోతల్‌ హౌస్‌ మేడమ్‌గా, ఓ స్మగ్లర్‌కు ఉంపుడుగత్తెగా బతికి ఒక యువకుడిపై మోజుతో అతనికోసం చట్టవ్యతిరేక కార్యకలాపాలన్నిటికీ స్వస్తి చెప్పి అనుకోకుండా ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుని బయటపడే మార్గం కోసైం మళ్ళీ క్రయిమ్‌ను ఆశ్రయించాలా? వద్దా? అన్న సందిగ్ధంలో పడింది దేవకి...
ఒళ్ళు అమ్ముకుని తనను పెంచిపోషించిన తల్లి ఆరోగ్యం కోసం ఎంతటి ఘాతుకమైనా చేయవచ్చనుకున్నాడు భీమబలుడు గోవర్థనం...
ఇంకా...అవినీతి ఆరోపణలపై ఉద్యోగం వూడొట్టుకున్న పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌, ప్రఖ్యాత రచయిత భార్య అయివుండి కూడా స్వైరిణిగా జీవితం గడిపే చంప, ఆడపిచ్చితో తండ్రికి అవస్థలు తెచ్చిపెట్టిన జితేంద్ర...
ఇలా ఎందరో!
రియల్‌ క్రయిమ్‌ అంటే ఓ మెంటల్‌ గేమ్‌ అని చూపిన నవల.

Write a review

Note: HTML is not translated!
Bad           Good