ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు ఎన్నో పుస్తకాలు వెలువడుతున్నాయి. ప్రజల్లో ఆరోగ్యస్పృహ పెరిగింది. వార్తాప్రసార సాధనాలు కూడా ఆరోగ్యానికి విధిగా కొంత సమయాన్ని కేటాయిస్తున్నాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే శ్రీ జీ.వి.పూర్ణచంద్‌ ఎంచుకున్న అంశం పూర్తిగా కొత్తది. తెలుగువారి సంస్కృతికోణం నుంచి చేసిన ఆహార పదార్ధాల ఆరోగ్య విశ్లేషణ ప్రతి ఒక్కరినీ ఒక్కక్షణం అలాగే ఆపివేసి నిలబెట్టి ప్రశ్నిస్తుంది.
తరతరాల తెలుగు రుచులు పుస్తకం చదివిన తరువాత తెలుగువారి మహనీయమైన రుచులు తలచుకుంటేనే మనసు పులకరిస్తోంది. మన పూర్వులు మనకన్నా ఆరోగ్యవంతులుగా ఉన్నారు. మనకన్నా కమ్మని రుచుల్ని ఆస్వాదించారు. మనకన్నా జీవితాన్ని ఎక్కువ ఉల్లాసంగా అనుభవించారు. ఇప్పుడు మనం వాటిని ఎందుకు కోల్పోతున్నాం? మనల్ని పరభాషా వ్యామోంతో పాటు పరభావ వ్యామోహం కూడా బాగా ఆవహించడం వలన, మన వారసత్వసంపద లోని సుగుణాలను ఎత్తి దూరంగా పారపోసుకుంటున్నాం. ఒకవిధంగా తెలుగు వారికి ఇది దురదృష్టకరమైన పరిణామమే!
'ఇది వంటల పుస్తకం కాదు'. ఇది మన ఆహార చరిత్ర. మన సంస్కృతి చారిత్రక వైభవం ఇందులో ఇమిడి ఉంది. మన జాతి ఆరోగ్య మూలాలు ఇందులో ఉన్నాయి. మన అసలైన తెలుగు రుచులలోని ఆరోగ్యాంశాలు, చారిత్రకాంశాలను విశ్లేషణ చేసే ప్రయత్నం శ్రీ జి.వి.పూర్ణచంద్‌ చేయడం అభినందనీయం. ''తిండి కలిగితే కండ కలదోయ్‌, కండకలవాడేనోయి మనిషి'' అన్న గురజాడ మాటల్ని విస్మరించి కండలు కరిగిపోయే తిండికోసం ఎగబడే సమాజంలో ఇలాంటి రచనలు మరిన్ని రావలసిన ఆవశ్యకత ఉందని నొక్కి వక్కాణిస్తూ....

Write a review

Note: HTML is not translated!
Bad           Good