చెమట చుక్కలని చిందిస్తేనే చరిత్రను రాయగలవనీ తెలుసుకో
    నీ కోసం ఆరాటంగా వున్న మీ అమ్మ, నాన్న, సమాజపు కళ్ళలో
    మరింత వెలుగులు నింపేలా నీ ఆరాటం ఉండాలనీ ఆశిస్తూ, దీవిస్తూ....
                        - డా. కూర రామ్మోహన్‌ రెడ్డి
    కింది కులాల వాండ్లు కథా సాహిత్యాన్ని ప్రంపంచీకరణ నుంచే విస్తృతంగా రాస్తున్నారు. ఆ రాసిన సామిత్యమంతా చరిత్ర కెక్కాలంటే దాన్ని అన్ని వర్గాల వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరముంది. యాదగిరి రాసిన ఇవి చదవాల్సిన కథలు మాత్రమే కాదు. ఆచరించాల్సిన కథలు కూడా! భవిష్యత్‌ తెలంగాణ బంగారు తెలంగాణాగా మారాలంటే సామాజిక తెలంగాణ ద్వారానే సాధ్యమని చెబుతున్నాడు. సిద్దెంకి తన కథల పరంపరను కొనసాగించాల్సిన అవసరముంది.
                        - సంగిశెట్టి శ్రీనివాస్‌
    సిద్దెంకి కథలన్నీ క్లుప్తంగా ఉంటాయి. నేరుగా ఎత్తుగడ విషయంలోకి ప్రవేశిస్తుంది. ప్రతిదీ నిర్దిష్టంగా ఉంటుంది. కథాశిల్పం విషయంలో సిద్దెంకి జాగురుకతతో, ఎరుకతో ఉన్నాడని ఆయన కథలు చదివాక అన్పిస్తుంది. పాఠకులు ఒక కథను చదివాక వాళ్లలో భావ ప్రకంపనం కలిగించడం కూడా శిల్పంలో భాగమే. కథాంశం ఎక్కడా సడలిపోకుండా చివరి వరకు నడిపించడంలో ఈ రచయితకు శ్రద్ధ ఉంది. ఆ పనిని విజయవంతంగా చేశాడు.
                        డా|| సి.కాశీం

Pages : 151

Write a review

Note: HTML is not translated!
Bad           Good