వ్యక్తిత్వ వికాసాన్ని మొదటిసారిగా సస్పెన్స్ కథా రూపంలో చెపుతున్న సరికొత్త సంచలన ప్రయోగం ఈ పుస్తకం. ఆ ప్రయోగాన్ని చేసింది ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్. తెలుగులోనే ఇది అపూర్వం. ఛేంజ్ మేనేజ్మెంట్ పై తొలి పుస్తకమిది.
ఈ పుస్తకం రాజకీయాల గురించి కాదు. ఎత్తులు పై ఎత్తులు గురించి అసలే కాదు. మనిషి గురించి. తాను మరింత బాగా బ్రతకటం కోసం. వ్యక్తిగతంగానూ, సమాజాన్ని మార్చటం కోసమూ ఏం చెయ్యాలో ఆలోచించవలసిన కర్తవ్యం ప్రతి మనిషి మీదా ఉన్నది. తాను మరింత బావుండాలంటే తన విలువల్ని ఏ విధంగా మార్చుకోవాలన్నది ఎవరికి వారే ఆలోచించుకోవాలి కదా! అయితే.. కేవలం ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. కొంతైనా ఆచరించాలి.
ఈ పుస్తకం చివర్లో మంత్రి కొడుకు కథ ఒకటున్నది. మంచినీతి వున్న జానపద కథ. ''సూక్తులు వినటమే కాదు. ఆచరించాలి కూడా' అని చెప్పే అద్భుతమైన నీతి ఉన్న కథ.
అయితే ప్రతి మార్పు మంచికి దోహదం చేయకపోవచ్చు. అంతెందుకు? ఈ పుస్తకంలో కొన్ని భావాలు మీకు నచ్చకపోవచ్చు. అంత మాత్రాన అసలు మార్పే వద్దనలేం కదా! అదే ఛేంజ్ మేనేజ్మెంట్.
ఏ మార్పైనా ముందు హేళన చేయబడుతుంది. తరువాత ప్రశ్నింపబడుతుంది. ఆపైన విమర్శించబడుతుంది. వేగంగా తిరస్కరింపబడుతుంది. చివరగా - ఒప్పుకోబడుతుంది. మార్పు అంటే కొత్తని నిర్భీతిగా ఆహ్వానించగలగటం! మంచి మార్పుకి భయపడని అలాంటివారికి ఈ పుస్తకం అంకితం అంటున్నారు రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్.
Rs.225.00
In Stock
-
+