యాంత్రిక జీవనానికి అలవాటు పడిన మానవుడు అనేక రుగ్మతలకు లోనవుతూ - వైద్యుల చుట్టూ తిరగడం, ఆస్పత్రుల పాలవడం మనం అనునిత్యం చూస్తున్న విషయమే!

మనం వాడే ప్రతి మందు వల్ల మరికొన్ని అదనపు రుగ్మతలు (సైడ్‌ ఎఫెక్ట్స్‌) కొని తెచ్చుకొంటున్నాము. కానీ ప్రతిఇ మందు తయారీలో వాడే వస్తువులన్నీ ప్రకృతిలో లభించేవే.

సహజంగా మనకు లభించే పప్పు దినుసులు, పళ్ళు, సుగంథ ద్రవ్యాలు, ఫల పుష్పాలు, ఆకుకూరలు వగయిరాలు ఆహారంగా తీసుకోవడంతో మందులు వాడటం వల్ల కలిగే (సైడ్‌ ఎఫెక్ట్స్‌) నుండి మానవుడు సునాయసంగా తప్పించుకోగలడని భావించిన డా|| జి.వి.పూర్ణచంద్‌ తన అనుభవాన్నంతటిని రంగరించి వంటింటిలో వుండే వస్తువులను వాటి లక్షణాలనీ విపులీకరించి మన ముందుంచుతున్నారీ పుస్తకంలో. తీరా అవన్నీ పరిశీలిస్తే మన మామ్మలు, అమ్మమ్మలు, అమ్మలు చేసే వంటింటి వైద్యం కనిపిస్తుంది. ఇంతటి విలువైన పుస్తకాన్ని ఈ అత్యవసర కాలంలో పాఠక మహాశయుల కరకమలాలకు అందించగలగడం గర్వంగా భావిస్తున్నాం - పబ్లిషర్స్‌ 

Write a review

Note: HTML is not translated!
Bad           Good