ప్రాచీన కవిత్వం లో అతిమానుషమైన లేదా దైవీయమైన అంశాలెన్నో వస్తాయి. దేవుడున్నాడో లేదో నాకు తెలియదు. దేవుడు సందేహం కావచ్చు. భక్తుడు నిజం, భాక్తకవి ఆస్తిత్వ వేదన నిజం, ఆత్మవేదన లోంచి వచ్చిన ఏ భావోద్వేగాన్ని , మనం తక్కువ చేసి చూడనక్కర లేదు. దేవుడి పై ఆవిశ్వాసం అన్నమయ్య కీర్తననో, పోతన గజెందుడి ఆరినో, ఆస్వాదించడానికి అర్దం కాబోదన నా ఆవగాహన.ప్రాచీన సాహిత్యం లో జీవదాతువుగల ఆమూల్య పడి బీజాలెన్నో కనపడతాయి. అవి మానవ సంబందాల్ని మౌలికంగా నిర్వచించి వ్యాఖ్యానిస్తాయి. విద్యార్ధులు మొదలు గృహస్తుల దాక జీవన కల నేర్పుతాయి. జీవిత సంస్కారాన్ని పండిస్తాయి. సమకాలీనత గల అటువంటి రచనలను శోధించి, వివరంగా విశ్లేషించి, భాషా సాహిత్యాభిమానులకు పరిచయం చేస్తుంది ఈ గ్రంధం. 

కథ, కవిత, విమర్శ రంగాల్లో 'సాహితీ త్రిముఖుడు'గా పేరొందిన అగ్రశ్రేణి రచయిత డా|| పాపినేని శివశంకర్‌.

తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాషా సాహిత్యాలపై సమానాధికారం గల శివశంకర్‌ ప్రాచీన సాహిత్యం అన్వేషించి చేసిన ఈ విశ్లేషణలు అమెరికాలో వెలువడే 'తెలుగునాడి' పత్రికలో ధారావాహినిగా సాహిత్యాభిమానులను అలరించాయి.

Pages : 368
Year Of Publisah : 2012

Write a review

Note: HTML is not translated!
Bad           Good