సాధారణంగా మనకు తెలియని విషయాన్ని సందేహంగా భావిస్తే, కొద్దిమంది ఇతరులకు తెలిసి ఉండి మనకు తెలియని విషయాలను రహస్యాలుగా పరిగణిస్తాం! ఆ రహస్యాలేవో తెలుసుకొనేవరకూ, మన మనస్సులోని మథనం అలా కొనసాగుతూనే ఉంటుంది. అలనాటి మహర్షు లందరివద్ద మాత్రమే ఉండి, జనసామాన్యానికి తెలియని ఎన్నో అంశాలు చిరకాలంగా మహత్తర రహస్యాలుగానే ఉండిపోతాయి. రహస్యం వెల్లడి కావాలంటే అవి ప్రజలందరికీ తెలిసితీరాలి. మహర్షుల శిష్యపరంపర చేసినది అదే!...కానీ, కాలక్రమేణా శైథిల్యం చెందడమో - మరుగున పడడమో జరిగి ప్రజానీకానికి అందకుండా పోయాయి. విజ్ఞులైన వేదసంపన్నుల వివరణలతో ఆ ''తాళపత్ర రహస్యాలు'' నేటికి తిరిగి వెల్లడయ్యేలా గ్రంథ రూపాన్ని సంతరించుకుంటున్నాయి.

అత్యధికులు అపోహపడే కొన్ని అంశాలకు వాటి వాస్తవాలు కూడా ఈ గ్రంథంలో చేర్చబడ్డాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good