'పాతిక సంవత్సరాల ''స్వతంత్ర'' మనబడే దాని తర్వాత, 1860వ సంవతంలో అటే వంద సంత్సరాలకు పైగా గతంలో చేసిన ఒకానొక- చట్టం క్రింద నన్ను అరెస్టు చేయడంలో విచిత్రమేమీ లేదు.ఒక ''మహాత్ముని'' ప్రత్యక్ష సారధ్యం క్రింద భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకత్వంలో ''అహింసాయుతం''గా సాగినట్లు చెప్పబడే విప్లవం; ఆయన సంరక్షణలో పెరిగిన, 15 సంవత్సరాలకు పైగా సాగిన జవహర్‌లాల్‌ నెహ్రూ తిరుగులేని పాలన - ఇవి భారతదేశాన్ని సజీవమైన పురోగమన యుగంలో నడిపించటం కాక పాత చట్టాలూ, పాత తొత్తులూ, పాత పేర్లతో సహా మృతప్రాయమైన నిస్తబ్ధయుగంలోకి ఎందుకు ఎలా విసిరివేసినాయి? రాజకీయ అధికారంలో పైపై మార్పులు ఏమూనా కావచ్చు గాక! ఇక సాంఘీక వ్యవస్థలో గానీ, మన ఆర్థిక నిర్మాణంలో గాని ప్రధానమైన అంశం ఏదీ మారలేదు. నిజానికీ సామ్రాజ్యవాద దోపిడి గతంలో లాగే - బహుశా మరింత ఉధృతంగా - కొనసాగుతోంది. ఫ్యూడల్‌ దోపిడి, గ్రామీణ ప్రాంతాల్లోని హింసాకాండ కొత్త తీవ్రతని అందుకున్నాయి. ఆ పాత నియమ నిబంధనలతో సహా అధఙకార యంత్రాంగం ప్రాథమికంగా యథాతథంగా కొనసాగుతోంది''.

సిగ్గుచేటైన ఈ పరిస్ధితుల్ని మార్చటానికి నేను, నా సహచరులు కుట్రపన్నామని ఆరోపించటం చోద్యంగా లేదా? రాబోయే దశాబ్ధాల వరకూ దేశపు వనరుల సర్వస్వాన్నీ విదేశీ పెట్టుబడిదారులకు అమ్మివేసినవారే మమ్మల్న ద్రోహులని ఆరోపించడం విచిత్రంగా లేదా? తనలో దేశభక్తి అణుమాత్రమున్న ఏ పౌరుడైనా సహజంగానే ఈ సిగ్గుచేటైన పరిస్ధితులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు. భారత ప్రజల, భారత జాతి సముజ్వలకీర్తిని పున:ప్రతిష్టాపించటానికి పాటుపడతాడు.''

Write a review

Note: HTML is not translated!
Bad           Good