మనలో ప్రతి ఒక్కరిలోను ఊపరిలూదే కథ ఉంది.

సుధామూర్తి పుస్తకాల్లో పుటలు పరుచుకున్న ఆసక్తికర వ్యక్తుల స్ఫూర్తిదాయక నిజజీవిత కథనాలు మనందరిపై మరిచిపోలేని ముద్రవేస్తాయి అనటంలో సందేహంలేదు. కాని సామాజిక సేవలో భాగంగా వ్యక్తిగతంగా తనకెదురైన వ్యక్తుల కథల్ని వాటిల్లో అందించగలిగారు కానీ, వాటిని మించినవి మనందరిని చేరుకోవాల్సినవి బోలెడన్ని ఉంటాయి. అలాంటి నిజజీవిత మధురిమల మణిహారమే - తడి ఆరని సంతకాలు

(ఆంగ్ల మాతృక : SOMETHING HAPPENED ON THE WAY TO HEAVEN).

పెంగ్విన్‌ ప్రచురణ సంస్థ పెట్టిన పోటీలలో వచ్చిన ఎంట్రీల నుంచి సుధామూర్తి ఎంపిక చేసిన ఈ కథలు మన రోజువారి నిత్య జీవితంలో మనకు కనిపించీ కనిపించకుండా మనచుట్టూనే తిరుగుతున్న - ఆశ, నమ్మకం, సంతోషం, మానవత్వం, దయ, త్యాగాలను ప్రతీకలు ! అంతర్వాహినులు!

మంచిని, మానవత్వాన్ని నమ్మే పాఠకులందరినీ కరిగించి, కదలించి, ఔన్నత్యాన్ని మరింత మెరిపిస్తుందీ కథల సంపుటి!

పేజీలు :133

Write a review

Note: HTML is not translated!
Bad           Good