భారతదేశంలో బౌద్ధవాజ్మయ పునరుద్దరణ చేసిన రాహుల్‌ సాంకృత్యాయన్‌, ధర్మానంద కోశాంబి, భిక్షు జగదీశ్‌ కశ్యప్‌, భరత్‌సింగ్‌ ఉపాధ్యాయ, భిక్షు ధమ్మరక్షితల వరుసన భదంత ఆనంద కౌసల్యాయన్‌ను కూడా ఎంతో గౌరవ భావంతో తలచుకుంటారు.
జీవితమంతా బౌద్ధధర్మ విస్తరణ కోసం శ్రమించిన భదంత ఆనంద కౌసల్యాయన్‌ శ్రీలంక, ఇంగ్లాడ్‌, బర్మా, నేపాల్‌ మొదలైన దేశాల్లో పర్యటించి తన ఈ యాత్రల అనుభవాల గురించి విస్తృతంగా రాశారు.
బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ తన వెనక లక్షల మంది బౌద్ధ అనుయాయులను వదలి వెళ్ళాడు. వారందరికీ - ముఖ్యంగా మహారాష్ట్రలో - సమర్ధుడైన ఒక నాయకుడు కావలసి వచ్చింది. ఆ కొరత తీర్చడానికి భదంత ఆనంద కౌసల్యాయన్‌ నాగ్‌పూర్‌లోని 'దీక్షాభూమి'లో ఉంటూ మహారాష్ట్రలోని దళిత బౌద్ధులకు మార్గనిర్దేశం చేశారు. ఆయన పాళీ త్రిపిటకాలను, ఇతర బౌద్ధ గ్రంథాలను పరిశీలించి వాటిలోని మూల సూత్రాలను, వివరాలను సేకరించి ప్రచురించారు కూడా.
భదంత ఆనంద కౌసల్యాయన్‌ సమాజ శ్రేయస్సుకు ఉపకరించే విలువలను నెలకొల్పేందుకు తన యాత్రల ద్వారా, కలం ద్వారా నిరంతరం పోరాటం చేసిన మనిషి.
హిందీ, తెలుగు భాషల్లో సుదీర్ఘమైన అనుభవం ఉన్న అనువాదకులు. విశిష్ట రచనలను తెలుగు నుంచి హిందీలోకి, హిందీ లోంచి తెలుగులోకి సమర్ధవంతంగా అనువదించారు. తన సాహిత్య కృషికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారంతో సహా అనేక పురస్కారాలు, సన్మానాలు పోందారు. - జె.లక్ష్మిరెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good