ప్రతీ ప్రాంతంలోనూ, ప్రతీ దేశంలోనూ, కవులూ, రచయితలూ, కళాకారులూ, పండితులూ, మేధావులూ, అజ్ఞానులూ, అన్ని రకాల వాళ్ళూ వుంటారు. ఎవరి విజ్ఞానం ఎలా వుందో తెలుసుకోవాలంటే, దాన్ని కొలిచే పరికరం ఏది? - మనిషి విజ్ఞానాన్ని కొలిలచే ధర్మామీటరు, మార్క్సిజమే.

ఏ మనిషి జీవించే ఊరులో అయినా, పేదలూ - ధనికులూ వుంటారు. ఆ మనిషే, పేదగానో - ధనికుడిగానో, వుంటాడు. ఏ నగరంలో అయినా, ఏ దేశంలో అయినా, మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా, పూరి గుడిసెలూ, మహా భవనాలూ వుంటాయి. - అటువంటి తేడాలు ఎన్ని కనపడినా, ఆ తేడాలు మాత్రమే 'సత్యాన్ని' చెప్పలేవు.

మానవ సమాజంలో వున్న సత్యం అనేది, 'శ్రమ దోపిడీ!' ఆ సత్యం ఎప్పుడు బైట పడింది? మార్క్సు రాసిన 'కాపిటల్‌' పుస్తకం వచ్చినప్పుడే! ఆ పుస్తకం రాక ముందు, శ్రామిక వర్గం నించి దోపిడీ వర్గం దోచే ''అదనపు విలువ'' సంగతి ఎక్కడా ఎవ్వరికీ తెలీదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good