తెలుగు సాహిత్య చరిత్రలో శతక శాఖకు గణనీయమైన స్దానం ఉంది. శతకం పండితులను, పామరులను, గృహస్తులను, మహిళలను అందరిని రంజింపచేయగల సాహితి ప్రక్రియ. తెలుగు సాహిత్యంల్లో శతకాలు 12వ  శతాబ్దం నుంచి లభిస్తూనే ఉన్నాయి. ఈ శతాబ్దంలో రచించిన పందితారుద్యుల వారి వృషాధిప శతకమే తొలి శతకం. ఈ  800 సంవత్సరాల కాలంలో సుమారు ఆరు వేలకు పైగా శతకాల రచన జరిగినట్లు తెలుస్తున్నది. అందు నలుగు వేలకు పైగా ముద్రితాలు. శతo అంటే నూరు. ఒక శతకంలో నూరు పద్యాలే ఉండాలన్న నియమం ఎచట లేదు. కనుక నేడు లభించే శతకాలలో అధిక శాతం నూరు, నూట ఎనిమిది పద్యాలూ ఉన్నాయి.  మిగితవాతిలో ఒక స్థిర సంఖ్యా లేదు . కొన్ని శతకాలలో అంతకు మించిన సంఖ్యలో పద్యాలున్న దాఖలా లేకపోలేదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good