వివిధ ఛానళ్ళలో వస్తున్న మార్పులనూ, సాంకేతిక రంగంలో అభివృద్ధిని సమీక్షిస్తూ ప్రజల దృక్కోణం నుంచి వాటి విలువను అంచనా వేయడం వేణుగోపాల్‌ గారి వ్యాసాల ప్రత్యేకత. టీ.వీ. ప్రభావాలను ఇప్పుడే అధ్యయనం చేయకపోతే సమాజానికి హాని కలుగుతుందన్నది ఆయన హెచ్చరిక. అస్తమానం టీ.వీ.కి అతుక్కుపోయి కూర్చునే అలవాటు ప్రమాదకరమంటారాయన. విశాఖపట్నంలో యుక్త వయస్సు వచ్చి ఒక బాలిక తన తమ్ముడు టీ.వీ. కట్టివేశాడని అలిగి ఆత్మహత్య చేసుకున్న సంఘటనను ఉదహరించి, ఇది పరిస్ధితి తీవ్రతను సూచిస్తున్నదన్నారు. మనుషుల మధ్య మమతానుబంధాలను దెబ్బతీయడం, నిద్రలేమి, అర్ధంకాని ఏదో దిగులుతో కుంగిపోవడం మొదలైన అవలక్షణాలు కలుగుతున్నాయన్న వాస్తవాన్ని ఒకటికి రెండుసార్లు పాఠకుల దృష్టికి తెచ్చారు. కార్యక్రమాలు ఆశించినంతగా మెరుగపడనందుకు బాధను వ్యక్తం చేస్తూ ఆయన వ్యాఖ్యానించారిలా ''సామాజిక బాధ్యతల విషయంలో సినిమా ఎంత దారుణంగా తయారైందో టీ.వీ. అంతకంటే ఘోరంగా తయారైంది. సినిమా తీయగలిగిన ప్రతివాడూ చానల్‌ పెడతాడు. ఇవి అలాంటి కొందరి చేతుల్లో ఉండిపోతాయి. అందుకే ఇలా అఘోరిస్తోంది మన తెలుగు టీ.వీ.''. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good