''పని సమయం కాక తీరిక సమయం సంపదకి కొలమానంగా ఉంటుంది. తీరిక సమయం, ఉన్నత కార్యకలాపాల కోసం సమయమూ కలిసిన తీరిక సమయం, సహజంగానే దాని సొంతదారుని ఒక కొత్తమనిషిగా మారుస్తుంది.'' - కారల్‌మార్క్స్‌

    ఆధునిక సమాజంలో నాగరికతకున్న ప్రాధాన్యం, సంస్కృతికి కనిపించడం లేదు. నాగరికత భౌతికమైనది. సంస్కృతి మానసికమైనది. సివిలైజేషన్‌ అనే ఆంగ్ల పదాన్ని సంజీవదేవ్‌ సభ్యతగా అనువదించాడు. దాన్ని నాగరికతగా అనువదించితే మరింత అర్థవంతంగా ఉండేది. ఏమయినా ఆయన దృష్టిలో నాగరికత అంటే భౌతికమైనదే. అంటే బాహ్యమైనది. సంస్కృతి ఆంతరికమైనది. అంటే మానసికమైనది. ఈ రెండు సమాన స్థాయిలో ఎదిగినప్పుడే సమాజం ఆరోగ్యకరంగా ఎదిగినట్టు భావించాలి. ఒక వ్యక్తి సంస్కృతీపరంగా ఎదిగాడన్నా, మానవుడిగా రూపొందాడన్నా ఆ వ్యక్తిలో హేతువాదం, శ్రేయోకాంక్ష, రసానుభూతి అనే మూడు లక్షణాలు ఉండాలంటాడు సంజీవదేవ్‌. ఈ మూడింటిలో ఏది లోపించినా ఆ వ్యక్తిని సంస్కృతీపరుడుగా, నిజమైన మానవుడిగా పరిగణించలేం.ఈ మూడు లక్షణాలు పుణికిపుచ్చుకున్న వ్యక్తులే నిజమైన సామాజికాభివృద్ధికి తోడ్పడగలుగుతారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good