విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు, రచయితలకు, ఉద్యోగార్ధులకు, జర్నలిస్టులకు ఆంగ్ల-తెలుగు భాషల్లో పద సంపదను పెంచుగోగోరువారికి ఉపయోగపడే నిఘంటువు.
నేడు ప్రపంచంలో ఆంగ్ల భాష ప్రాధాన్యత, వాడకం క్షణ క్షణానికి పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మనం ఏ భాషలోనైనా చక్కగా రాయాలన్నా, మాట్లాడాలన్నా, మనకు ఆ భాషలోని సమాన, వ్యతిరేకార్థ పదాలు తెలిసివుంటేనే మనం ఆ భాషపై గట్టి పట్టు సాధించడానికి వీలవుతుంది.
ప్రతి ఆంగ్ల, తెలుగు పదానికి నిజమైన సమాన అర్థాన్ని యిచ్చే పదం, సమాన వ్యతిరేక అర్థాన్ని యిచ్చే పదం వుందా అంటే నిఘంటు రూపకర్తలు ఎవరైనా లేదనే అంటారు. అయితే ఒక పదానికి ఒకే అర్థాన్ని యిచ్చే పదాన్ని లేదా పర్యాయపదాన్ని, అలాగే దరిదాపుగా వుండే వ్యతిరేక అర్థాన్ని యిచ్చే పదాన్ని యివ్వవచ్చు అంటారు. ఆంగ్ల పదాలలో దాదాపు ముఖ్యమైన వాటిని ఎంపిక చేసి వాటికి తెలుగులో సమాన లేదా పర్యాయ పదాలను; వ్యతిరేకార్థ పదాలను ఈ నిఘంటువులో చేర్చారు.