'మొత్తం సమాజాన్ని మార్చటం నాకు చేతకాదని - నాకు చేతనైంది కూడా నేను చెయ్యొద్దా? అలా చెయ్యకుండా నేను బతకలేనని నాకు తెలిసిపోయింది. ఆ పనిలో నన్ను నేను నిరూపించుకుంటున్నాను. దానివల్ల నాకెంతో తృప్తి. నా జీవితం సార్థకమవుతోందన్న భావం. ఆ భావం కలగటమే స్వేచ్ఛకు అర్థం కదూ? నా బతుకు మాత్రమే నేను బతకటానికయితే నాకీ స్వేచ్ఛ అక్కర్లేదు. నా స్వేచ్ఛకు ఒక అర్థం వుండాలి. ఆ అర్థం కోసం అన్వేషించటమే యిప్పుడు నా పని.''
''మనలాంటి వాళ్ళ స్వేచ్ఛకోసం ఏమీ చెయ్యకపోతే మన స్వేచ్ఛకు అర్థమేముంది?''
''నాకు ప్రపంచంతో సజీవ సంబంధం కావాలి. నా ఉనికివల్ల సమాజానికేదో చలనం వుండాలి.''
''మన జీవితాల్లోనయినా వాటి చుట్టూ వుండే సమాజంలో నయినా వాటి చలన సూత్రాలను అన్వేషించడమే ఆవశ్యకత. ఆ ఆవశ్యకతను గుర్తించడమే స్వేచ్ఛ. ఆ అన్వేషణ దశలో స్వేచ్ఛ నవలలోని అరుణ జీవితంలోలా సంక్షోభమూ వుంది. సంఘర్షణ వుంది. ఆవశ్యకతను గుర్తించిన తర్వాత స్వేచ్ఛానంతర జీవితంలో సంఘర్షణేగాని సంక్షోభం వుండే అవకాశం లేదు.'

Write a review

Note: HTML is not translated!
Bad           Good