ప్రవీణ్‌గా పిలువబడే రచయిత పూర్తిపేరు ‘వేంకట విశ్వంభర సుబ్రమణ్య సీతారామరాజు’. వీరి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం తాలూకా చిత్పలపాలం అయినప్పటికీ బాల్యం, విధ్యాభ్యాసం అంతా విజయనగరం జిల్లా అలమండ గ్రామంలో మాతామహుల ఇంటసాగింది. 

శాలివాహన శక సంవత్సరం 1431,

ఆంధ్ర మహావిష్ణు దేవాలయము,

శ్రీకాకుళం.

‘మరి నాలుగు రోజుల్లో యుద్ధం పెట్టుకుని ప్రభువులు ఇలా తీరిగ్గా నాట్య ప్రదర్శనలకి రావడం ఏవిటోయ్‌ శర్మా...?

గుసగుసగా పలికారు సీతాపతి శాస్త్రిగారు.

‘‘ఎనిమిది పదుల వయసులో ఇంత చలికి కూడా వెరవక తమరు దయచేయలేదాండీ?’’

సున్నితంగా చురకవేశాడు పాతికేళ్ళ మార్తాండ శర్మ.

‘‘ప్రభువులతో మనకి సాహిత్యం ఏవిటోయ్‌...?’’

వీరు ఇరువురికి సరిగ్గా నాలుగు వరుసల ముందు కృష్ణదేవరాయలు, దేవేరులు ఇరువురితోనూ ఆసీనుడై ఉన్నాడు. అతని ప్రసన్న వదనంలో ఏదో తెలియని తేజస్సు ఉట్టిపడుతుంది. ఆడపాలు అందించిన తాంబూలాన్ని దక్షిణ హస్తంతో అందుకుని నోట్లో వేసుకున్నాడు... రాణుల వైపు చూసి చిరునవ్వు నవ్వాడు...

‘‘అయినా శర్మా... ప్రభువుల మొహంలో యుద్ధంతాలుకూ ఆందోళన ఎక్కడా కానరావడంలేదు చూశావా...?’’...

పేజీలు : 152

Write a review

Note: HTML is not translated!
Bad           Good