"ఆతను మెల్లగా తన నడుం చుట్టూ పడిన చేతులను బలవంతంగా విడదీసాడు తన గుండెల్లోకి ఒదిగిపోయిన ఆ అమ్మాయిని భుజాల పట్టుకుని , వెనక్కి, ఆనించి దిండు మీదికి పడుకోబెట్టాడు. ఆ పడుకో బెత్తతంలో అనూ పవిట జారిపోయింది. వంటిమీద సృహలేని అన్నూ వెనక్కి వెల్లకిలా ఆలాగే పడుకుంది. ఆటను పయిట తీసి సరిచేసి కప్పబోయాడు. మేడలో ఉన్న గొలుసు ఒకటి వెనక్కి జుట్టులోకి చిక్కడంతో దాన్ని జుట్టు నుంచి తప్పించి సరిచేసాడు.
ఆ గొలుసు ఆ అమ్మాయి గుండెల మీద దీపపు వెలుగులో కనిపిస్తోంది. బోర్లా పడిన లాకెట్ తీసి సరిచేసాడు. దాన్ని సరిగ్గా తిప్పి పైటకొంగు సర్దబోయిన అతనికి ఆ లాకెట్ లో ఒక యువతి ఫోటి నవ్వుతూ కనిపించింది.
ఆటను దాన్ని చూడగానే సర్పద్రష్టలా అగిపోయాడు . వంగి, ఆ లాకెట్ ణి చేతులోకి పట్టుకొని మరింత శ్రద్దగా పరీక్షగా చూసాడు. సందేహం లేదు. ఆ పక్క పాపిడి, ఆ అంచున్న పొట్టి చేతుల జాకెట్టు, కనుబొమ్మల మధ్య చిన్న బొట్టు , అరవిరిసిన మొగ్గలాంటి ఆ చిరునవ్వు యింకెవ్వరూ? పారిజాతమే ! ఆటను నిశ్చేష్టుడయ్యాడు . అతని చూపులు ఆ లాకేట్టుకు అతుక్కుపోయినట్టుగా నిల్చి పోయాయి. సందేహంలేదు .. ఆది పారిజాతం ఫోతేనే . మై గాడ్ ! మై గాడ్! అతని నుదుటి నిండా చమటలు అలుముకున్నాయి. " యద్దనపూడి సులోచనారాణి కలం నుండి వెలువడిన మరో నవలా కుసుమం శ్వేత గులాబి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good