స్వీట్‌ హోమ్‌ - రంగనాయకమ్మ

ఓ ఆడదీ, ఓ మగవాడూ, వాళ్ళిద్దరికీ ఓ ఇల్లు, అది స్వర్గమా ? నరకమా ? -
ఇప్పటి సంఘంలోఏది ఇవ్వటానికైనా ఎక్కువ కారణం మగవాడూ మగడేనంటారు రంగనాయకమ్మగారు. మగవాడి అలవాట్లూ, సంస్కారమూ, సభ్యతా, సామర్ధ్యమూ, మంచితనమూ మనసున్నతనమూ - ఇట్లా ఎన్నో సంసారాన్ని తీర్చిదిద్దుతాయి. 'స్వీట్‌ హోమ్‌'లో బుచ్చిబాబూ విమలా ఒకరికొకరు. అయితే బుచ్చిబాబులోనూ లోపాలున్నాయి. ''నాపతి దేవుడు అద్భుతమైన మనిషి ! న భూతో న భవిష్యతి. ఇంటిసంగతీ ఒంటి సంగతీ ఇల్లాలి సంగతీ పట్టవు. పుస్తకాలు చదవడు, అర్ధంకావు ! సినిమాలు చూడడు. బోధపడవు! స్నేహితుల్లేరు, నిలవలేరు! సిగరెట్లు కాలుస్తాడమ్మోయ్‌! నాకూ కాల్చే స్వాతంత్య్రం ఇచ్చాడు. నోట్లో వేలు పెడ్తే కొరకలేడమ్మా ! నా చదువు అర్ధంతరం చేసుకొని కాలేజీ ఎగ్గొట్టాను. ఈ బుద్ధావతారం నన్ను ఏ నట్టేట్లో ముంచేస్తాడోనని భయంతో ఛస్తున్నాను.... విమల తన స్నేహితురాలికి ఇట్లా ఉత్తరం రాస్తుంది.

సంసారం ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. ఈ దాంపత్య ధర్మంలో ఇద్దరికీ కొన్ని సరిహద్దులుంటాయి. దీన్ని గ్రహిస్తేనే కాపురం 'స్వీట్‌ హోమ్‌' అవుతుంది. లేకపోతే?!.... దాంపత్యంలోని మధురిమనీ, ఒద్దికైన కాపురంలోని ఆనందాన్నీ - అందులో వున్న కష్టనిష్టురాలతో సహా - చిత్రించిన నవల ఇది. మూడు భాగాలూ కలిసి ఇప్పుడు ఒకే సంపుటిగా వెలువడింది. మూడు భాగాలలో పాత్రలు ఒక్కటైనా వేరువేరు కథల కిందే తీసుకోవాలని చెబుతారు రంగనాయకమ్మ. కవర్‌పేజీ డిజైన్‌ : బాపు.  రాయల్‌ సైజు బౌండ్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good