మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15 తేదీన స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాము కదా! అది మనకు స్వాతంత్య్రం వచ్చిన రోజు. మన భారతదేశం 1947 సంవత్సరంలో స్వాతంత్య్రం పొందింది. అంతకుమునుపు బ్రిటీషువారు మన దేశాన్ని పాలించారు.

                అశోకుడు, అక్బరు వంటి మహా చుక్రవర్తులు పాలించిన దేశం కదా! మరి ంత పెద్ద భారతదేశం బ్రిటీషువారి వశం ఎలా అయింది?

                మొదటి నుంచీ ఇతర దేశాలవారు వ్యాపారం కోసం మన దేశానికి వచ్చేవారు. మన దేశంలో మిరియాలు, లవంగాలు, ఏలకులవంటి సుగంధ ద్రవ్యాలు పండిరచేవారు. మస్లిస్‌, ఇతర మేలిరకం నూలు వస్త్రాలు తయారుచేసేవారు. ఇక్కడి చేతి పరిశ్రమలవారు మంచి పనితనంతో చేసే ఇతర వస్తువులు నాణ్యతకు పేరు పడ్డవి. అవి విదేశీయులకు కావలిసి ఉండేవి.

                వాటిని ఇక్కడి నుంచి కొనుక్కుపోయి వారి వారి దేశాలలో ఎక్కువ ధరలకు అమ్మి లాభాలు సంపాదించేవారు. అలా గ్రీకులు, రోమనులు, అరబ్బులు ఎంతో ప్రాచీన కాలం నుంచే మన దేశంతో వ్యాపారం చేశారు.

పేజీలు : 103

Write a review

Note: HTML is not translated!
Bad           Good