నా వృత్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్‌ ఘంటసాల భగవద్గీత.
ద్వాపర యుగంలో శ్రీకృష్ణపరమాత్మ గీతను బోధించాడు. ఈ యుగంలో తెలుగు ప్రజలకు దాన్ని మరలా వినిపించి భగవద్గీత మరింత ప్రాచుర్యం పొందటానికి కారణభూతుడయ్యాడు ఘంటసాల. ఆయన జన్మ పవిత్రమైనది. అంతటి మహత్తరమైన ఘంటసాల భగవద్గీత రికార్డింగ్‌లో పాలు పంచుకోవడానికి వేంకటేశ్వర్డుఉ నన్ను సారధిగా నియమించి అనుగ్రహించినందుకు నా జన్మకూడా తరించిందనే సంతోషంతో వుంటున్నాను.

నేను తొలుత ఆశించినట్టు సినిమా ప్రపంచంలో స్ధిరపడి ఒకవేళ వేయి సినిమాలకు దర్శకత్వం వహించినా, నిర్మించినా అది ఘంటసాల గారి చేత గానం చేయించిన భగవద్గీతకు తూగవని నిర్మొహమాటంగా చెప్పగలను. - పుట్టా మంగపతి

Write a review

Note: HTML is not translated!
Bad           Good