అతడో చిల్లర దొంగ. హీనుడు. స్త్రీలోలుడు. క్రూరుడు. డబ్బు వ్యామోహపరుడు. సర్వదుర్గుణాలపుట్ట. తేలికగా డబ్బు సంపాదించాలని స్వామి అవతారం ఎత్తాడు. ఆశ్రమం నిర్మించాడు. భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తా అన్నాడు. రోగాల్ని తగ్గిస్తానన్నాడు. పిల్లలు లేని దంపతులకి పిల్లలు పుట్టిస్తానన్నాడు. మాయలూ మంత్రాలూ చేసాడు. జనాన్ని నమ్మించాడు. వంచించాడు. వక్రబుద్ధులు చూపెట్టాడు. అంతులేని సంపద పోగేసుకున్నాడు. ఆశ్రమంలో అత్యాచారాలు జరిగాయి. హత్యలు జరిగాయి. పెద్ద పెద్ద అధికార్లూ, పోలీసులూ, మంత్రులూ స్వామి పాదాక్రాంతులయ్యారు.

నేటి మన సమాజంలో స్వాములుగానూ, బాబాలుగానూ చలామణి అవుతూ పూజలందుకుంటున్న అనేకమంది దగుల్బాజీల కోవలోని వాడే ఈ స్వామికూడా! స్వామి క్రూరత్వానికి ఒక అబల గురైంది. భర్తని పోగొట్టుకుంది. స్వామి స్వరూపాన్ని గ్రహించింది. స్వామిని కటకటాల వెనక్కి పంపిస్తానని ప్రతిన బూనింది.

ఆ అబల ఆవేదననీ, ఆరాటాన్నీ, పోరాటాన్నీ, ఉద్యమాన్నీ ఉత్తేజపూరితంగానూ, స్వాముల బతుకుల్నీ, బండారాల్నీ, దుష్టత్వాల్నీ, కపటత్వాల్నీ, దుర్మార్గాల్నీ మోసాల్నీ, ధనకాంక్షల్నీ ఆసక్తికరంగానూ, ఉత్కంఠ భరితంగానూ అక్షరీకరించిన నవల 'స్వాములోరు'.

పేజీలు : 159

Write a review

Note: HTML is not translated!
Bad           Good