గుణము లేనిదే తనకు విధించిన ధర్మమును చక్కగా ఆచరించిన యెడల , అది ఇతరులాచారించు ధర్మము కంటే ఉత్తమమైనది. అగును తన స్వధర్మాచరణ యందు మరణము కలిగినను, శ్రేయస్కరమేగాని ఇతరులు ఆచరించు ధర్మమూ భయమును కలుగజేయును. ఇచట స్వధర్మ మనగా ఆత్మసంబంధమైన ధర్మము -అత్మప్రాప్తికి వలసిన సాధనములు, మానవుడు ఏ దేశమున ,ఏ ప్రాంతమున, ఏ మతమున ఏ వర్ణమున, ఏ ఆశ్రమమున జనించినను , అతనికి విధించబడిన ఆయా దేశ , మత , వర్ణ ఆశ్రమ ధర్మములు దోషయుక్తములు అయినను అతనికి శేయస్సునే కలిగించును. ఇందులకు ఉదాహరణముగ ధర్మవ్యాధుని జీవిత చరిత్రను గైకొన వచ్చును. పరధర్మము సుఖప్రదముగా తోచినను దుఖప్రదము భయానకమైనదే . కాన స్వధర్మమును వదలి, పరధర్మమును ఆచరింపరాదనీ దీని తాత్పర్యము. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good