మాతృగర్భం నుంచి బయటపడిన తరువాత మావి తొలిగాక తొలిశ్వాస తీసుకునే క్షణం నుంచి ఆ శ్వాసకి, ఆ శరీరానికి ఎంతకాలం సంబంధం కొనసాగుతుందో ఆ కాల అవధిని ఆయుష్షు అంటారు. అది ఏమి, ఏమిటనే ప్రశ్నలతో పెరిగి యవ్వనంలో మురిసి కొంత సాధించి అరవై దాటాక అనుభవసారంతో జీవితాన్ని సార్థకం చేసుకోవడాన్ని జీవనగతి అంటారు. ఈ ఆయుష్షు ఏమిటీ బాధలు? ఎందుకీ వ్యధలు? అనుకుంటూ చావు ఎప్పుడని ప్రతీక్షణం అనుకుంటూ చిరకాలం జీవించేది జీవితం కాదు. మనస్సు, శరీరం, యింద్రియములు, ఆత్మ ప్రసన్నాత్మకంగా ఆరోగ్యంగా నిండు శక్తితో మరణం కూడా అనాయాసంగా వచ్చి నవ్వుతూ తీసుకెళ్ళిపోయే జీవితాన్ని మనిషి ఆకాక్షించాలి. అలాంటి జీవితాన్ని సమాజానికి ప్రతిపాదించారు మన అద్భుత శాస్త్రజ్ఞులైన ఆచార్యులు ఆయుర్వేద రూపంలో.

పేజీలు : 624

Write a review

Note: HTML is not translated!
Bad           Good