19వ శతాబ్ధం మధ్యకాలంలో భారతీయ చైతన్యాన్ని క్తొ దిశల్లోకి ప్రవహింపచేసిన అపరభగీరధులు ఎందరో ఉన్నారు. దాదాపు ఈ సమయంలోనే సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఉద్యమాలు భారతదేశ:లో అన్ని ప్రాంతాల్లోనూ కొంత వెనుకా ముందుగా గట్టి ఊపందుకున్నాయి. సంఘసంస్కరణోద్యమం, జాతీయోద్యమాల ప్రభావం ఆంధ్రదేశం మీద ప్రసరించింది. ఆంధ్రదేశంలో సాంస్కృతిక, రాజకీయ చైతన్యం మొదట ఆంధ్రలోనూ, తరువాత రాయలసీమలోనూ, ఆ తరువాత తెలంగాణలోనూ క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. నిజాం రాష్ట్రంలోని తెలంగాణ భిన్నమైన కారణాల వల్ల రాజకీయంగా, ఆర్ధికంగా, విద్యావిషయంగా, సాంస్కృతికంగా ముందంజ వేయలేకపోయింది.
ప్రధానంగా సమైక్యాంధ్ర అవతరణకు ముందూ, ఆ తరువాత కూడా తెలంగాణా ప్రాంతంలో ఆర్ధిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిస్ధితులు పరిశీలించినప్పుడు ఇక్కడ అభివృద్ధి అన్నది ఆలస్యంగా జరుగుతూ రావడానికి కారణాలు స్ఫూరిస్తాయి. ఈ చిమ్మచీకట్లలో గోలకొండ పత్రిక అనే చిరుదివ్వెను వెలిగించి తన బహుముఖ ప్రజ్ఞతో సంస్ధల్ని, ఉద్యమాల్ని నిర్మించి, ప్రజల చైతన్యాన్ని తట్టిలేపినవారు శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారు. తెలుగు వాళ్ళందరూ గర్వించేలా తెలుగు భాషా సాహిత్య సంస్కృతులకు అక్షరనీరాజనం పట్టినవారు ఆయన. శ్రీ కె.ఎస్‌.రమణగారు రచించిన ఈ పుస్తకం చదవటం అంటే శ్రీ సురవరం ప్రతాపరెడ్డి జీవితాన్నే కాదు, 19-20 శతాబ్దుల మధ్య తెలుగువారి సాంఘీక, రాజకీయ, సాంస్కృతిక చరిత్రను తెలుసుకోవటమూ అవుతుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good