ప్రాణికోటికి జాతక దశలున్నట్లే దేశాలకు కూడా గ్రహబలం ఉంటుందని తోస్తుంది. పందొమ్మిదో శతాబ్ది భారతదేశ చరిత్ర ఈ దృష్టిలో పరిశీలించితే ఈ అంశం మరీ స్పష్టం కావచ్చు. అది మహాపురుషుల యుగంగా రాణించింది. ఆ యుగంలో జన్మించిన మహానుభావులందరూ అదృష్ట జాతకులు. వారు అన్ని రంగాల్లోనూ అగ్రేసరులు. భారతదేశం వారికి ఇల్లూ వాకిలీ అయినా దిగంత విశ్రాంత కీర్తులు. ఇక్కడ పుట్టిన వారేకాదు - ఈ నేలపై అడుగు పెట్టిన వారికి కూడా ఆ భాగ్యం లభించడం విశేషం.
నల్లని వారిని తెల్లవారు పాలించిన రోజులవి. వారంటే దేశంలో ఇంత అంతాకాదు - ఎంతో అభిమానం అంకురించిన కాలమది. ఎవరి పూర్వజన్మ సుకృతమో భారతీయ సంస్కృతి వారి ఎదలో నాటింది శార్మణ్య దేశంలో జన్మించిన మోక్షముల్లరు వేద సంస్కృతి నారాధించినాడు. గ్రియర్సను భిన్న స్వరాలలో భారత వాణఙని విన్నాడు. జోన్సు కణ్వాశ్రమంలో విహరించిన శకుంతలను దర్శించినాడు. గెటే తన్మయుడైనాడు. కాల్డువెల్‌ తెలుగుబిడ్డలకు తల్లి మాటలు వినిపించినాడు. బ్రౌను మాటల మూటల నందించినాడు. పందొమ్మిదో శతాబ్ది చరిత్ర ఈ మహాయజ్ఞంతో పూర్ణమైంది.
దీనితో కేవలం శ్వేత జాతీయులే కాక, అరేబియా పారశీక దేశాల నుంచి వచ్చిన మహానుభావులు కూడా పాల్గొన్నారు. వారు మహా మహిమలను, శక్తులను సాధించినవారు - పాండితీ సంపన్నులు - ఉన్నత విద్యావంతులు - కులీనులు.
వీర లిట్లుండ సామాన్యుల వర్గ మింకొకటి - ఇటువంటి యజ్ఞంలో ప్రధానపాత్ర నిర్వహించింది. వారు పొట్టకూటికై స్వదేశం వదిలి  సాహసం చేసి ఊరుకాని ఊరుకు వచ్చి ఉద్యోగాలు చేసి ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చి స్ధిరకీర్తులైనారు. ఈ పరంపరలో తెలుగువారికి ప్రత్యేకముగా చిరస్మరణీయుడు, ఆత్మీయుడు మెడోస్‌ టైలర్‌. టైలర్‌ 1824 నుండి 60 వరకు దాదాపు ముప్పదియారు ఏండ్లు మన దేశంలో ఉన్నాడు. సివిల్‌, మిలిటరీ ఉద్యోగాలను నిర్వహించినాడు. ఇతని ఉద్యోగ జీవితంలో అధికభాగం సురపురం సంస్ధానాలకు అంకితమయింది. పందొమ్మిదవ శతాబ్ది రాజకీయ సాంఘీక చరిత్రకు ఈయన ఆత్మకథ రమణీయమయిన దర్పణం. అనువాదం శ్రీ జి.కృష్ణ 

Write a review

Note: HTML is not translated!
Bad           Good