ఆదికవి అమరలేఖిని నుండి తప:ఫలంగా వెలువడిన రామాయణ గ్రంథం మన సంస్కృతికి మహత్తరనిధి కాగా సుందరకాండ నిత్యపారాయణ గ్రంథ రత్నమైనది. ఈ మహాకావ్యంలో శిరోమణి స్ధానాన్ని అలంకరించిన సుందరకాండ తత్త్వదృష్ట్యా, కవితా తత్త్వదృష్ట్యా కూడా విశేష స్ధానాన్ని అందుకుంది. ఈ కాండ పఠన, శ్రవణ, మననాదులను గురించి, బ్రహ్మాండ పురాణంలో విశేషంగా ఉల్లేఖింపబడింది. సుందరకాండ అంతా మహామంత్రమనీ, గాయత్రీ తత్త్వ ప్రతిపాదకమనీ, దీని పారాయణ మాత్రంచే అరిష్టాలన్నీ దూరమై సర్వాభీష్టాలు చేకూరుతాయన్నీ, పాపాలన్నీ నాశనమవుతాయనీ, ధర్మార్ధ కామ మోక్షాలన్న చతుర్విధ పురుషార్థాలూ సాధించబడి, ఆయురారోగ్య భోగభాగ్యాలు చేకూరుతాయనీ మనుషులు ఏకకంఠంతో నొక్కి వక్కాణించారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good