శ్రీమద్రామయణే సున్దరకాణ్డే
దాంతో లంకను తగులబెట్టి, తోక-మనసు చల్లబరచుకుని, ఆవలి ఒడ్డున చేరాడు. ఆ చేరడంలో, ఫలితం ''విజయ''మని సంకేతమిచ్చాడే కాని, తానే అధినాయకుడిలాగా ప్రవర్తించలేదు. దొరికింది సందు కదా! అని, ఇప్పటి పెద్దల వలె ప్రగల్భాలకు పోలేదు.
కార్యసాధకునికి కావలసిన తెలివితేటలు, బుద్ధి, జ్ఞానం, వుండవలసిన వినయ విధేయతలు, పెద్దల ఎడ గౌరవం, ముందుచూపు అన్నీ మహర్షి వాల్మీకీ హనుమంతుడి ద్వారా మనకు అందిస్తాడు. అర్ధం చేసుకుని బుద్ధిగా బ్రతుకమనే ఇంగిత జ్ఞానాన్ని, సంకేతాన్ని కూడా మనకు తెలియబరుస్తాడు.
ఎక్కడికక్కడ సత్సంబంధాలు, మానవత్వం, పెద్దల ఎడ గౌరవ మర్యాదలు, వినయ విధేయతలు, శ్రద్ధాభక్తుల విశ్వాసము వీటి లక్షణాలను వివరించి చెప్పి, మనకు వివేకోదయం కల్గించే అద్భుత గాధ - ఇది.
జరిగిందా, లేదా ? అన్న ప్రశ్నకు దారి చేయ్యకుండా, అవసరాలోచనల చెదపురుగులు బుర్రలను తొలిచెయ్యకుండా, బుద్ధిని ప్రదర్శించి, విజ్ఞులుగా మెలుగుదాం, రండి.
ఏ ఉద్ధేశ్యంతోనైతే, ఈ దేశానికి వాల్మీకి మహర్షి ఆదికావ్యంగా శ్రీమద్రామాయణాన్ని ప్రసాదించాడో, ఆ వుద్ధేశాన్ని సదుద్ధేశంతో స్వీకరించి ''మానవత్వా''న్ని నిల్పుకుని, ''సర్వ'' మానవాళి సౌభాగ్యానికి సర్వదా, సదా ప్రయత్నిస్తామని చెప్పడం కాదు. చేసి చూపిద్ధాం.
Rs.250.00
In Stock
-
+