'మాన్యులు', 'కవివర్యులు' శ్రీ సుంకర కోటేశ్వరరావు గారు తొమ్మిది నాటికలు (శమీవహ్ని, తోడొకరుండి..., నాటకాంతం హి జీవితమ్‌!, నాన్నోయ్‌! నాకు పెళ్లొద్దుక్ష్మ!!, వారసత్వం, పులిరాజాకి ఉరివేయగలమా?!, విశ్వరూపం!, మేధావులున్నారు జాగ్రత్త!, పొడుస్తున్న పొద్దు) రచించి ఓ గ్రంథంగా కూర్చి ''సుంకోవ్‌ నవ నాటికలు'' పేర అందించారు. 

భర్త సన్యాసిరావు అశక్తుడు, అసమర్థుడు, తండ్రిచాటు బిడ్డ. ఇలాంటివాళ్ళను సమాజంలో చూస్తుంటాము. అందుకే రచయిత ''సన్నాసి'' అని భార్యచేత అనిపిస్తాడు. అరుంధతి పాత్ర ఎంతో విలక్షణమైంది. ఆకాశంలో అరుంధతీ నక్షత్రం ఎంత ఆదర్శమైందో ఈ అరుంధతి కూడా అంతే. సన్యాసిరావు నీచత్వాన్ని, తార్పుడుతనాన్ని సహించలేక పోయింది. పరిస్థితులు భయంకరంగా మారాయి. గత్యంతరంలేదు. అందుకే అపరకాళికలా మారింది. సన్యాసిని చంపింది. నీచుడైన ధనుంజయరావు పారిపోయాడు. అరుంధతి ధీరవనిత, వీరవనిత. మారుతున్న సమాజంలో అబల సబలగా మారాలి అనేది రచయిత ఈ నాటికలో ప్రతిపాదించారు. ఈనాటికలో పాత సంప్రదాయాలను స్పరిస్తూ, నవీన సంప్రదాయాలకు దిశా నిర్దేశం చేశారు రచయిత. వీరి శిల్పనిర్మాణంలో ఇది ప్రత్యేకత.

పేజీలు : 357

Write a review

Note: HTML is not translated!
Bad           Good