పిల్లలూ, పెద్దలూ ముఖ్యంగా ఉపాధ్యాయులు తప్పక చదవాల్సిన, చదివించాల్సిన పుస్తకం 'సుమతి - వేమన నీతి పద్యాలు'. తెలుగులో శతక సాహిత్యంలో ఆణిముత్యాల్లాంటివి సుమతి, వేమన పద్యాలు. కొన్ని శతాబ్ధాల తర్వాత కూడా ఈ పద్యాలు ప్రజల నాలుకలపై నిలిచి వున్నాయంటే వాటిలో వున్న గొప్పదనమే కారణం. సుమతి, వేమన పద్యాలు ఎంతో సరళంగానూ, సరసంగానూ వుంటూ సూటిగా మనసుకు హత్తుకునేలా వుండి గొప్ప సత్యాలనూ, లోకరీతులనూ తెలియజేస్తాయి. రోజు రోజుకూ అన్ని రకాల విలువలూ పతనమవుతున్న నేటి ఆధునిక సమాజంలో సుమతి, వేమన లాంటి పద్యాలనూ చదవడం, మననం చేసుకోవడం, ఆచరించడం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో సుప్రసిద్ధమైన 130 సుమతీ పద్యాలు, 140 వేమన పద్యాలు ఎక్కువగా నీతి పద్యాలను ఎంపికజేసి పిన్నలకూ, పెద్దలకు అర్ధమయ్యేటట్లుగా వీలైనంత సరళంగా భావంతో అందించారు రచయిత పి.రాజేశ్వర రావు గారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good