వానకు తడయనివాడు, సుమతీశతకంలో ఒక్క పద్యమైనా తెలియని తెలుగు వాడు ఉండడని చెప్పటం యథార్థం. ఇంగ్లీషు రైములకు ఇంత ప్రచారం వచ్చిన ఈ కాలంలో కూడా తల్లులు, పిల్లలకు ఒకటో రెండో సుమతీ శతక పద్యాలను నేర్పిస్తూనే ఉన్నారు. ఇంత విశేష ప్రచారం ఉన్న శతకమైనా దానిని ఎవరు వ్రాశారు అనే విషయాన్ని ఈ నాటికీ ఏ తెలుగు సాహిత్య పరిశోధకులు నిగ్గు తేల్చలేదు. దీనిమీద మూడు రకాల వాదాలు ఉన్నాయి. మొదటిది దీనిని రచించిన కవి వేములవాడ భీమకవి అనేది. రెండవది భద్రభూపాలుడు లేక బద్దెన అనే చోడవంశీయుడైన సామంతుడు అనేది. ఇక మూడవ వాదం సుమతి అనే నామాంతరం ఉన్న జైన భిక్షుకుడైన కవి ఎవరో ఆయన ఆత్మ నామ సంబోధనతో ఈ నీతి శతకాన్ని రచించాడనేది.

ప్రజలలో చాలా కాలం నుంచి సుమతీశతకం భద్ర భూపాల విరచితం అనే ప్రవాదం ఉన్నది. రెండవ విషయం ఆయన ఇంకొక నీతి శాస్త్ర గ్రంథం 'నీతిశాస్త్ర ముక్తావళి'ని రచించాడు. ఆ గ్రంథం కొన్ని ప్రతులలో

శ్రీవిభుడు, గర్వితారి

క్ష్మావర దళకోపలబ్ధ జయలక్ష్మీ సం

భావితుడు, సుమతి శతకము

గావించిన ప్రోడ గావ్య కమలాసనుడన్‌

అనే పద్యము ఉండటం వలన దీనిని రచించిన కవి భద్రభూపాలుడు లేక బద్దెన అని చెప్పవచ్చును

పేజీలు : 56

Write a review

Note: HTML is not translated!
Bad           Good