సుమధుర భాషితాలు ఎంతో గంభీరమైన, విస్తృతమైన, మనోహరమైన భావాలతో ఇతరుల మనసులను రంజింపజేసే శక్తి గల పదాల/మాటల మూటలు. వీటిల్లో సూక్తులు, ఉద్ధారములు, నీతి వాక్యములు, సామెతలు, ఆర్యోక్తులు, కవివాక్కులు వగైరా అంశములు విశదీకరింపబడినవి. వీటిని వివిధ శీర్షికల్లో పొందుపరిచాను (అనుక్రమణిక చూడండి).
ఈ సుమధుర భాషితాలు అందరినీ అక్షరాస్యులుగా చేయడానికి, సమాజంలో సౌజన్యం పెంపొందించడానికి తోడ్పడతాయి. సర్వమానవ సౌభ్రాతృత్వమే ధ్యేయంగా పెట్టుకొని విశ్వకళ్యాణ ప్రాప్తి కొరకు ఈ కృషఙ సలపడం జరిగింది.
ఈ పుస్తకం ఒక విజ్ఞాన ఖని/గని. మీకు టైమ్‌పాస్‌ కాలక్షేపం. మీ తీరిక సమయాల్లో కుటుంబసభ్యులతో గూడి చదువవచ్చును.

Write a review

Note: HTML is not translated!
Bad           Good