నేటి సంక్షుభిత లోకంలో మనిషి కింకర్తవ్యమూఢుడై నిలబడి ఉన్నాడు. కర్తవ్యాకర్తవ్యముల యందు ప్రమాణబుద్ది కోల్పోయి ఉన్నాడు. మారుతున్న జీవన గమనాలు - విలువలు - అనివార్య మైన జీవన పోరాటాలూ - వీటి నడుమ ఆధునిక మానవుడు మహోదధి వంటి వాజ్మయరస ఫలానుభూతికి దూరం అయి విహ్వలుడు అవుతున్నాడు. అతనికి మంచి ఏమిటో తెలుసు. కానీ ఆచరించలేడు. చెడు అంటే ఏమిటో తెలుసు - కానీ దానిని దూరం చేసుకోలేడు. 'ఊహకలంగి - దీనదశలో' కొట్టుమిట్టాడు తున్నాడు.

    ఈ నేపథ్యంలో అవతరించిన శ్రీ అప్పాజోస్యులవారి 'సుగుణాఢ్య శతకం' పలుకుబడిలో కానీ ప్రణాళికలో కానీ విశిష్టమైనది. శతక హృదయాన్ని గమనిస్తే మనిషి - స్వార్థాన్ని వదలి త్యాగ హృదయుడు కావాలనే ప్రబోధం శతకం అంతటా అభివ్యాప్తమై ఉన్నది. ఇంకా విద్యా ప్రాశస్త్యం, కవితా వైశిష్ట్యం, సజ్జన పద్ధతి, కర్మయోగశ్రేష్ఠత, నిరాడంబర జీవనవిధాన ఉత్కృష్టత మొదలగు ఎన్నో అంశాలు అప్పాజోస్యులవారి అంతరంగంలో చంపకోత్పల సౌరభాలు విరజిమ్మి'' పైకెగసి సమస్త పద్యపాఠక లోకానికి కవితా సుగంధాలను చూరలిచ్చేయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good