ఈ రోజు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చదువుకు ఏంటో విలువ పెరుగుతున్నది. గ్లోబలైజేషన్ ఫలితంగా ఎన్నో మంచి కోర్స్ లు తత్పలితంగా ఎన్నో ఉద్యోగ అవకాశాలు మన ముందు కొచ్చాయి. వాటి ఫలాలు మనం పొందాలంటే మనం  కృషి చేయక తప్పదు .చదువు తత్పలితంగా కలిగే ఇబ్బందులను ఎదుర్కోవడానికి, సత్పలితాలు పొందడానికి , ఆటంకాలను అధిగమించడానికి, భవిష్యత్తును అందంగా మలుచుకోవడానికి, ఎంతో మంది విద్యార్ధులు కెరీర్ గైడెన్స్ కౌన్సలింగ్ అ కొరకు నన్ను సంప్రదించి అద్బుతమైన విజయాలు సాధించారు.
నా ఈ సేవలు రాష్ట్రంలో ఉన్న పల్లె పల్లెకు చేరి విద్యార్ధులను కార్యోన్ముఖులను చేయడానికి , వారి చదువులో కలిగే ఇబ్బందులను తొలగించడానికి ఉపయోగపడి వారి భవిషత్తు ఉజ్వలంగా ఉండాలనే తలంపుతో ఈ పుస్తకాన్ని వ్రాయడానికి పూనుకున్నారు.
ఈ నా తోలిప్రయత్నం వృధా కాదు. ఈ పుస్తకంలో నా  అనుభవంలో వ్రాయడానికి ప్రతి పేజి ప్రతి అక్షరం విద్యార్ధులను కార్యోన్ముఖులుగా చేయగలదని  గాడంగా విశ్వసిస్తున్నాను. ఈ పుస్తకం చదవడ్డానికి ప్రతి విద్యార్ధి ఖర్చు పెట్టిన అమూల్యమైన సమయం వారి జీవితంలో మరుపురాని ఘటాన్ని అవిష్కరిస్తుంది. అభివృద్దికి బంగారు బాట వేస్తుంది. తద్వారా వారు సమాజానికి సేవ చేసే అవకాశం లభిస్తుంది.
ఈ పుస్తకం ప్రతి విద్యార్ధికి తన చదువులో కలిగే ఆటంకాలకు పరిష్కారం చూపుతుంది. నెం 1 కావాలని తహ తహలాడే విద్యార్ధులకు స్నేహ హస్తం అందిస్తుంది. ఇది విద్యార్థులకే కాదు వారి తల్లి దండ్రులు, ఉపాద్యాయులు కూడా చదివి తెలుసుకోవలసిన ఏంతో విషయ పరిజ్ఞానం ఇందులో ఉంది. నా ఈ మొదటి రచన పుస్తకాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ

 

Write a review

Note: HTML is not translated!
Bad           Good