ఆధునిక వైజ్ఞానికంగా ప్రజలు జీవితాలు ఎంతగా మారి పోతున్నాయో వారి మనస్సుల్లో అలజడి కూడా అంతగా పెరిగిపోతున్నది. ఇందుకు ప్రధాన కారణం ఆధునిక ప్రజాజీవనాలు అభద్రతకు, అశాంతికి అలవాలుగా మారిపోవటమే.  ఈ అశాంతి నుంచి, అభద్రతా నుంచి విముక్తి కలగాల్నాటే మనస్సును చిక్కబట్టుకొని భగవన్నతి  చేయటమే ఏకైక మార్గమని తత్వవేత్తలు స్వాములు, బాబాలు, మనస్తత్వశాత్రవేత్తలు అందరూ చెప్పుతున్న మాటే, అయితే ఈ చెప్పే విధానంలో తేడాలు ఉండవచ్చు కానీ మన హిందూ దారంలో భగవంతుని ప్రసన్నం చేసుకొనటానికి ఎన్నో నుతులు స్తుతులు , వ్రతాలు, యజ్ఞాలు, విధానాలు ఉన్నాయి. భగవంతుని  చేరటానికి అన్నిటిలోకి ముఖ్య మైనది భక్తి ఆచార్య శంకరులు కోడూ మోక్ష సాధన సామగ్ర్యాం భక్తీ రేవగరీయాసి అని మోక్షం పొందలనతే భక్తిని మించిన సాధనమే లేదన్నారు.ప్రతి రోజు భక్తీ తో భవవంతుని ప్రార్ధిస్తే ఆయన అనుగ్రహం కలుగుతుంది. భక్తితో భవంతుని ప్రార్ధించ టానికి వీలుగా ఈ చిన్న పుస్తకాన్ని ముఖ్యమైన స్తుతులతో మీకు అందిస్తున్నామ్ . ప్రతిదినం పూజతో భాగవత్ర్పర్ధన చేసుకోవాలనుకునే వారికి మార్గ దర్శకంగా పూజా విధానం కూడా ఇందులో ఇవ్వబడింది. అలాగే మంత్రపుష్పం, మగలహారతి పాటలు కూడా ఇందులో ఇవ్వబడింది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good