శ్రీ ఆరుద్ర కావ్యం స్త్రీ పురాణం. ఇది స్త్రీల పురాణం కాదు. ఈకాలపు స్త్రీల పురాణం కాదు. ఆదిమకాలంనాటినుండీ సాగిన, సాగుతున్న సమాజంలో స్త్రీజాతి ఉనికిని వెనక్కి చూస్తున్న కావ్యం. మానవ పరిణామశాస్త్రం గురించి - అందులో మనదేశములో ఆదినుంచీ కాలక్రమాన స్త్రీ పురుషుల మధ్య జరిగిన పరిణామగాథను వివరంగా సుస్పష్టంగా సుదీర్ఘ కవితా చరిత్రగా యీ స్త్రీ పురాణం రాస్తూ వచ్చారు. ఈ స్త్రీ పురాణం అసలు ''మనిషీ - ఆడమనిషీ'' పేరుతో సాగుతూ వస్తున్న కావ్యం. ఇంకా తొలివంతు కూడా అవలేదు.
మానవమాత్రునిజన్మరహస్యాన్ని ఆధారం చేసుకుని ఏమీ లేని - శూన్యం నుంచి - అతని పరిణతినీ అతని ఒంటరితనాన్నీ ఆ సుందర లోకంలో తనకు తోడు కోరుకోవడంతో ప్రారంభించి - ఆడదాని సృష్టికి అంకురార్పణ చేసి - వారి చెలిమి కలిమి ఆహ్లాదంతో నిండిన జీవితాన్ని ఎలా తారుమారు చేసుకున్నదీ సూచించారు. ఇక ఆడ-మగఉత్పన్నమయ్యాక - మిగిలినదేముంది - కలహాల కాపురం - ఎడదిడ్డెంపెడదిడ్డెంసంవాదనలు, ఎత్తిపొడుపులు, హేళనలు దాటి ఎదిగిన జీవితాల లోతుపాతులు - అందులోని పాత్రల ఆవేశకావేశాలు అన్నీ, జ్ఞాన అజ్ఞానాలూ అన్నీ అన్నీ సవివరంగా రాస్తూ వచ్చారు.
స్త్రీ పురుష చరిత్ర నొకసారి వెనక్కి తిరిగి చూసుకుంటూ - ఎవరిది తప్పని కాదు! ఎవరెంత ఒకరికొకరు సహకరించుకున్నారు? ఎవరు ఎవరి అణచివేతకోఆవేదనలకోకారణభూతులయ్యారు అన్న చారిత్రక పౌరాణిక సాంఘిక మానవ పరిణామం కూడా యీ సమస్యకి - అదే ఎవరు ఎవరికంటె ఎక్కువ తక్కువ అన్న వాద ప్రతివాదాలకి కారణం కదా - అదికూడా ఒకసారి రివైండ్‌ చేసి చూసుకుంటూ పరిస్థితులని ఆకళింపు చేసుకోవడం, అర్థం చేసుకోవడానికి కావలసిన జరిగిన చరిత్రను తెలుసుకోవడం కూడా మంచిదే కదా. ఇదే జరుగుతోంది ఆరుద్ర స్త్రీ పురాణం - ఈ భాగంలో. నిజానికి మానవజాతి పరిణామదృష్ట్యా యీ స్త్రీ పురుష సంబంధాలు మనం విశ్లేషించుకోవాలి. అందుకే ఈ స్త్రీ పురాణం, ఏదో కాలపు లోతుల్లో జొరబడి టేపును రివైండ్‌ చేసి వింటూవుంటేచిత్రవిచిత్రమైన వాస్తవికతలు మనని నివ్వెరపరుస్తాయి.
ఇది ఇంకా సాగవలసిన గాథ... ఇదొక అనంతమైన ధారావాహిక కావ్యం. బహుశా యీ ఆధునికయుగం దాకా సాగేదే.

Write a review

Note: HTML is not translated!
Bad           Good