పద్మా!
రఘుబాబు ఇప్పుడే వచ్చి వెళ్ళాడు! క్షమాపణలు కోరాడు మళ్ళీ మళ్ళీ! నాకు చాలా అన్యాయం చేశాన్నాడు. తనకు తానే అన్యాయం చేసుకున్నానన్నాడు! ఎన్ని జన్మల వరకైనా నా కోసమే ఎదురు చూస్తానన్నాడు. నాకేమనిపించిందంటే అతను పిరికివాడే, బలహీనుడే, మూర్ఖుడే! కానీ, మోసగాడు కాదు! దుర్మార్గుడు కాదు!... ఇదే నాకు తృప్తిగా అనిపించింది. ఈ ఆలోచనతో కొంచెం సంతోషం కలిగింది. నేను అతని మనసులో ఉన్నాననిపిస్తోంది. కానీ, నా మనసులో అతను లేడు! ఎప్పుడు అంతర్థానమై పోయాడో నాకే తెలీదు! పోయింది అదంతా! పద్మా! రఘుని క్షమించాలనిపించడం లేదు నాకు! ఇప్పటికి మాత్రం నాకు అలా అనిపించడం లేదు. చిన్న పిల్ల నెవరినైనా పెంచుకుందామా అని ఆలోచన కలుగుతోంది అప్పుడప్పుడూ! నువ్వు విదేశాల నించీ వచ్చే దాకా నీ కూతుర్ని నేను పెంచుతాను, నా దగ్గర వుంచరాదూ పద్మా!..."

మనసులోనే అదంతా రాసేసింది పార్వతి పద్మకి!

రఘు మనసులో తను ఎప్పుడూ వుందా?

ఎప్పుడూ వుంటే...?

అయ్యో! ఎంత అశక్తుడు!

మనసంతా నిండిపోయిన ఆలోచనలతో, నిశ్చలంగా కూర్చుని ఉందా స్త్రీ!

Write a review

Note: HTML is not translated!
Bad           Good