ఎందరో మహిళలు..  ఒక్కొక్క మహిళకు ఒక్కొక్క సమస్య, ఒకానొక సమస్య ఒక్కసారిగా వణికించేస్తుంది. అంతా అయోమయం. ఒక్కసారిగా చీకటి కమ్ముకుంటుంది. అంతా అగమ్యగోచరం. తెలియనితనం, అమాయకత్వం, భయం, సిగ్గు... కలిసి బద్దలు కొట్టలేని భీకర కుడ్యాలు నిర్మితమవుతాయి. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని విచిత్ర పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో లైఫ్ అయిపోయిందనిపిస్తుంది. కానీ కానే కాదు. సమస్యకు మూలమూ, కావలసిన తీరమూ చేరువైతే ఆనందం పరమానందమవుతుంది. జీవితం పరవశమవుతుంది. ఆ మూలమూ - తీరమూ చేరువ అవడానికి, జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకోవడానికి డా.సమరం రచించిన "స్త్రీలు గైనిక్ సమస్యలు" పుస్తకం ఒక మణిదీపం చదవండి...  చదవించండి...   - డాక్టర్ జి.సమరం

Write a review

Note: HTML is not translated!
Bad           Good